మహారాష్ట్ర : ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలడంతో ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనమైన ఘోర ఘటన సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతిలో జిల్లా మహిళల ఆసుపత్రిలోని మూడో అంతస్తులో నవజాత శిశు సంరక్షణ యూనిట్‌లో వెంటిలేటర్ పేలింది. దీంతో ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనమై ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్‌లో 39 మంది పసికందులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా కలిసి నవజాత శిశువులు ఉన్న యూనిట్‌లో ఉన్న మిగిలినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురికి సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు స్థానిక యంత్రాంగం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆసుపత్రిలోని నిర్వహణ లోపాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించాయి. మధ్యప్రదేశ్ లో రెండురోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఛింద్వాఢాలోని నవజాత శిశువులకు చికిత్స అందించే యూనిట్‌లో మంటలు చెలరేగడంతో ఒక శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు గాయపడ్డారు.
ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 09:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)