గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలవరం పై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష

1 గంట క్రితం

పోలవరం పై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 08:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పోలవరం : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఇసిఆర్ ఎఫ్) డ్యామ్ నిర్మాణంపై అంతర్జాతీయ నిపుణులు సమీక్షించారు. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌‌పాల్‌ పర్యటనలో భాగంగా తొలి రోజు బుధవారం ప్రాజెక్టులోని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ప్రస్ర్ట్ క్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) ప్రతినిధులతో కలిసి వారు గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన జరిగింది. కేంద్ర జలసంఘం డిజైన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సరబ్జిత్‌ సింగ్‌ బక్షి, పిపిఎ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, ఉప సంచాలకులు ఎ ప్రవీణ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం రమేష్‌కుమార్‌, సహాయ సంచాలకుడు సిహెచ్‌ సంజీవ్‌, నేషనల్‌ వాటర్‌ సిస్టం డైరెక్టర్‌ పన్నీర్‌ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్‌ గౌతమ్‌, సిఎస్ఎంఆర్ఎస్ శాస్త్రవేత్తలు షాహిద్‌ నూర్‌, ఎంకె భాషా, ఉదయ్‌ భాను చక్రబోర్తి, వ్యాప్కోస్‌ జనరల్‌ మేనేజర్‌ కెపిఎస్‌ త్యాగీ, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఇఎన్‌సి కె నరసింహమూర్తి, చీఫ్‌ ఇంజినీర్‌ కె శేషుబాబు, ఎస్‌ఇలు, ఇఇలు తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో పనులను కొంతసేపు పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి డిజైన్లను అఫ్రీ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయని, ప్రతి నిర్మాణం వద్ద అనుకున్న ప్రకారం మెటీరియల్ వినియోగిస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తున్నామని, అన్నీ నిర్దేశిత ప్రమాణాల మేరకే ఉన్నాయని వారు వివరించారు. ఇసిఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ సమయంలో డిజైన్‌‌కు అనుగుణంగా పనులు జరుగుతున్నయో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేశారు. ఆ పరికరాల్లో పనుల్లో ఏమైనా తేడా ఉంటే నమోదవుతుంది. అలా నమోదు చేసిన రికార్డులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు.. ఎలాంటి తేడాలు లేవని, నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జి హిల్, జి డ్యాష్ హిల్‌‌ల వద్ద జరుగుతున్న గ్రౌటింగ్ పనులపై సమీక్షించిన నిపుణులు తమ సంతృప్తి వ్యక్తం చేశారు. గత మే నెలలో నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన సమయంలో ఇచ్చిన సూచనలు, సలహాలపై తీసుకున్న చర్యలను అధికారులు పాయింట్ల వారీగా వారికి వివరించారు. వారి వివరణ పట్ల నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్