ప్రజాశక్తి- ఒంగోలు: ఒంగోలులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ దాసు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం... సంఘమిత్ర ఆసుపత్రిలో విధులు ముగించుకుని ఇద్దరు మహిళా వైద్యులు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో పద్మా టవర్స్ వద్దకు రాగానే వారి వాహనం అదుపుతప్పి.. మొదట ఒక చెత్త బండిని ఢీకొట్టింది. ఆ తర్వాత సైకిల్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ దాసును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆయన సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. కారు మరో మోటార్‌సైకిల్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో, స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం: ఏఆర్ కానిస్టేబుల్ దాసు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 08:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)