mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చేపల మార్కెట్ లో కుళ్ళిన చేపలు, రొయ్యలు..

16 గంటల క్రితం

raids
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 08:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : నగరంలోని చేపల మార్కెట్లో కుళ్ళి దుర్వాసనతో కూడిన చేపలు, రొయ్యలు ఉన్న రెండు దుకాణాలను సీజ్ చేశామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో, కమిషనర్ ఆదేశాల మేరకు లీలా మహల్ వద్ద గల చేపల మార్కెట్ లో వెటర్నరీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. తిరుపతి నగరంలోని లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్ లో 22 షాపులు ఉన్నాయి. ఇక్కడ కుళ్ళిన చేపలు విక్రాయిస్తున్నట్లు పిర్యాదులు వచ్చాయని తెలిపారు. చేపలు, రొయ్యలను ఫ్రీజర్లలో ఉంచి విక్రాయిస్తున్నారని తెలపడంతో తనిఖీ లు నిర్వహించామని తెలిపారు. ఇందులో షాప్ నంబర్ 9, షాప్ నెంబర్ 10 షాపులలో చెడిపోయినటువంటి నిల్వ ఉంచిన చేపలను, రొయ్యలను గుర్తించామని తెలిపారు. ఫ్రీజర్ కి మూతలు లేకుండా సరియైన పద్ధతిలో నిలువ చేయకపోవడం వలన అందులోని చేపలన్ని పురుగులు పట్టి దుర్వాసన్ వస్తోందని తెలిపారు. ఆ రెండు షాపులలో నిల్వ ఉన్నటువంటి చేపలను తీయించి వాటిపై క్రిమిసంహారకాలను చల్లించి, మున్సిపల్ వాహనంలో డంపింగ్ యార్దుకు తరలించామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 492 నుంచి 498 వరకు 521 సెక్షన్ 541 నుంచి 546 వరకు మరియు 622సెక్షన్ లను అనుసరించి తనిఖీలు నిర్వహించి అందులో ప్రజారోగ్యమునకు హాని కలిగించే విధంగా ఉన్నటువంటి చేపలను స్వాధీనం చేసుకొని సదరు 9,10 షాపులకు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి సీజ్ చేశామని తెలిపారు. మిగిలిన 20 షాపులకు పరిస్థితులను వివరించి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు వాళ్లు ఉంచుకున్న పరిస్థితులను పరిసరాలను మరింత మెరుగ్గా ఉంచి ప్రజల వినియోగమునకు నాణ్యమైన చేపలను ఎప్పటికప్పుడు తెచ్చుకొని విక్రయించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నాణ్యమైన చేపలు, తదితరాలను తీసుకువచ్చి ప్రజల వినియోగం వ్యాపారం చేసుకోవాలని, అలా లేనిచో ట్రేడ్ లైసెన్స్ రద్దుచేసి పై తెలిపిన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనికీలకు సంఘ నాయకులు, దుకాణదారులు సహకరించారని తెలిపారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ గుణశేఖర్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్