- మత్స్యకారుల మత్స్యకార్మిక సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరిలో చేపల వేటకు వెళ్ళి చనిపోయిన ఐదుగురు గిరిజన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్సేగ్రేషియా అందించాలని ఎపి మత్స్యకారుల మత్స్యకార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం జిల్లా ఎటపాక ఒకే గ్రామానికి చెందిన ఐదుగురి మృతితో ఆ ప్రాంతమంతా రోదనలు మిన్నంటాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో గోదావరి నీటిమట్టం పెరుగుదల చూసిన సమాచార కేంద్రాలు డిస్‌ప్లేలు ఏర్పాటు, చాటింఫు వేయించడం చేసినప్పుడే గిరిజన మత్స్యకారులకు ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ఈ పద్ధతులను వివరించక పోవడం వల్ల నిండి ప్రాణాలు నీటికి బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)