ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర వేడుకగా నిర్వహించనుంది. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ నిధులను నిర్వహణ కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిని ప్రభుత్వం ఆదేశించింది. జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.







కామెంట్‌లు (0)