సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్కాలర్‌షిప్‌ల బకాయిలకు రూ.534.63 కోట్లు

1 గంట క్రితం

students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.534.63 కోట్ల అదనపు నిధులకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఇడబ్యుఎస్‌ శాఖ ‌సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను బిసి, ఇబిసి, కాపు, మైనారిటీ విద్యార్థులకు చెల్లించేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనుబంధ నిధుల మంజూరు పూర్తయ్యే వరకు ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక వ్యయ నియంత్రణ నిబంధనలకు సడలింపు ఇచ్చి ఈ నిధులను అందుబాటులోకి తెనున్నారు. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్లకు వారి పీడీ ఖాతాల ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లు నిధులను నిర్దేశిత ప్రయోజనానికే వినియోగించి, వినియోగ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ జారీ చేసిన బడ్జెట్ విడుదల ఉత్తర్వుల మేరకు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్