గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండెపోటుతో బస్సులోనే ప్రాణాలొదిలిన ఆర్‌‌టిసి డ్రైవర్

08 అక్టోబర్, 2026

గుండెపోటుతో బస్సులోనే ప్రాణాలొదిలిన ఆర్‌‌టిసి డ్రైవర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - నక్కపల్లి (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై గురువారం ఆర్‌‌టిసి డ్రైవర్ బస్సు నడుపుతూ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. కాకినాడ రూరల్, రమణయ్యపేట గ్రామానికి చెందిన జట్ల శివ (34) కాకినాడ ఆర్‌‌టిసి డిపోలో డైలీ వేస్ డ్రైవర్‌‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం విధుల్లో చేరి కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌‌ను డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా కాగిత టోల్ ప్లాజా దాటిన తర్వాత గుండె నొప్పి రావడంతో ఆయన ఇబ్బందిపడ్డారు. నక్కపల్లి వరకూ డ్రైవ్ చేసి సీటులోనే కుప్పకూలిపోయారు. ప్రయాణికులు, స్థానికులు సిపిఆర్ చేసి, హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్