ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల కొనుగోలు శక్తి పెంచితే రూపాయి బలపడుతుంది

2 గంటల క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 05:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ సదస్సు లో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ

ప్రజాశక్తి-కాకినాడ: దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచితే రూపాయి విలువ బలపడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ తెలిపారు. శనివారం సాయంత్రం రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కాకినాడ యుటిఎఫ్ హోం లో రూపాయి పతనం - పర్యవసానాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎంవిఎస్ శర్మ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ప్రపంచంలో ఏ కరెన్సీ కి డిమాండ్ పెరుగుతూ ఉంటుందో ఆ దేశ కరెన్సీ బలపడుతుందన్నారు. ఒకప్పుడు కరెన్సీ విలువకు బంగారాన్ని స్టాండర్డ్ గా తీసుకుంటే , ప్రస్తుతం డాలర్ నే స్టాండర్డ్ గా తీసుకుంటున్నారని తెలిపారు. ఆసియాలో అతివేగంగా బలహీన పడుతున్న కరెన్సీ భారత రూపాయేనని పేర్కొన్నారు. 1949- 66 కాలంలో 1డాలర్ విలువ 5రూపాయలు గా ఉందన్నారు. 1990 నాటికి 22.74 రూపాయలుగా పడిపోయిందన్నారు. మోడీ పాలనా కాలంలో సెంచరీ కి దగ్గరగా ఉందని, కేంద్ర పాలకుల ఆర్ధిక విధానాలు వినాశకరంగా ఉన్నాయని విమర్శించారు. నూతన ఆర్ధిక విధానాలకు ముందు మనదేశంలో ఆర్ధిక వ్యవస్థ పై ప్రభుత్వ నియంత్రణ కొంతవరకు ఉండి, డాలర్ రాకపోకలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేదన్నారు. ప్రస్తుతం దేశంలో 782 బిలియన్ల డాలర్లు నిల్వ ఉన్నాయన్నారు. చైనా లో డాలర్లు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, అందువల్ల వాళ్ళ కరెన్సీ యూవాన్ బలపడుతోందన్నారు. మన దేశంలో రూపాయి విలువ పతనం కావడం వల్ల దిగుమతుల ఖర్చు పెరుగుతోందని, మనం ముడి సరుకులను తక్కువ డాలర్లకే కొనేస్తున్నారని తెలిపారు.దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వారసత్వ పన్ను వెయ్యాలని, ఇన్కమ్ టాక్స్ స్లాబ్స్ పెంచాలని, పెట్టుబడిదారుల వద్ద మూలుగుతున్న కోట్లాది రూపాయలను ప్రభుత్వము సేకరించాలని తెలిపారు. ఈ సదస్సులో ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్. గోవిందరాజులు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు తదితరులు పాల్గొనగా యుటిఎఫ్ నాయకుడు సుధీర్ స్వాగతం పలికారు. సదస్సు ముందుగా మన్య విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్