సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ ఫైడ్ సైలెన్సర్, త్రిబుల్ రైడింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

1 రోజు క్రితం

special drive
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి కాకినాడ : మోడీ ఫైడ్ సైలెన్సర్ వాడుతున్న వాహనదారుల పైన, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారుల పైన ఆదివారం స్థానిక దేవాలయం వీధిలో కాకినాడ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీ జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ వన్ సిఐ ఎన్ రమేష్ మాట్లాడుతూ మోడీఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించడం వలన వినికిడి సామర్థ్యం తగ్గుతుందని 60 డిస్మిల్ కన్నా ఎక్కువ శబ్దములతో చెముడు వస్తుందని అన్నారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ వలన రోడ్ ప్రమాదాల ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడికి సకాలంలో సహాయం చేసిన వారికి గుడ్ సమరిటన్ క్రింద 25 వేలు నగదు బహుమతి ఇస్తారని అన్నారు. రూ.1,50,000 వరకు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందిస్తారని అన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుండి ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స రోడ్డు ప్రమాద బాధితులకు వర్తిస్తుందన్నారు. ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వల్ల జరుగు రోడ్డు ప్రమాదాల గురించి, ట్రాఫిక్ రూల్స్ పైన, హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. అతివేగం గా వాహనం నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. జీబ్రా లైన్స్ లేని ప్రదేశములలో రోడ్డు ను ఏవిధంగా దాటాలి, ట్రాఫిక్ సైన్స్ వలన ఉపయోగములపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఐ సత్యనారాయణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్