గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘సచివాలయ’ ఉద్యోగుల సమస్యలపై జిల్లా కమిటీలు

4 గంటల క్రితం

grama-sachivalayam.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ శాఖ డైరెక్టర్‌ ఎం. శివప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించ డంతోపాటు మరణించిన ఉద్యోగుల కుటుంబా లకు అందాల్సిన ప్రయోజనాలను మూడు నెలల్లోగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ‌గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షుడిగా, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగుల విభాగం అధికారి కన్వీనర్‌గా, జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధిపతులతో పాటు జిల్లా ఖజానా అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి నెలా మూడో సోమవారం సమావేశం నిర్వహిం చాలి. ఉద్యోగుల ఫిర్యాదులను తప్పనిసరిగా నమోదు చేసి, వీలైనంత వరకు అదే సమావేశంలో పరిష్కరించాలి. మిగిలిన సమస్యలను తదుపరి సమావేశం నాటికి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. గత సమావేశాల్లోని ఫిర్యాదులపై చర్యల నివేదికలను సమీక్షించాలని పేర్కొన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మూడు నెలల్లోగా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్