శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionత్వరలో సదరం స్లాటు బుకింగ్‌ ప్రారంభం

3 రోజుల క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 40 వేల మందికి అవకాశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వికలాంగులకు ఉద్దేశించిన సదరం స్లాటు బుకింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తుపాను ప్రభావం ముగిసిన అనంతరం స్లాటు బుకింగ్‌‌కు రెండు నెలలపాటు అవకాశాన్ని కల్పించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌‌లైన్‌ ద్వారా సుమారు 40 వేల మంది వికలాంగు లకు స్లాటు బుకింగ్ సౌకర్యాన్ని కల్పించబోతు‌న్నట్లు వెల్లడించింది. వాట్సాప్ మనమిత్ర, సచివాలయాల ద్వారా మాత్రమే కాకుండా ఎపి సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నామని ప్రకటించింది. స్లాటు బుకింగ్‌‌లో ఈసారి 4 కొత్త పద్ధతులను ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలిపింది. స్లాటు బుక్ చేసుకుని వైద్య పరీక్షలకు ఆరు నెలల వరకు హాజరుకాకపోతే ఆ వ్యక్తి వివరాలు కనిపించవని, వైద్య పరీక్షలు జరగవని వెల్లడించింది. ప్రస్తుత విధానంలో కాలపరిమితి లేదని పేర్కొంది. స్లాట్‌ ‌బుకింగ్‌ ‌రోజు వికలాంగులకు అవసరమైన సమాచా రాన్ని అందించేందుకు సింగిల్ పాయింటు ఆఫ్ కంటాక్ట్ విధానం తీసుకొచ్చామని తెలిపింది. ​వికలాంగ ప్రమాణాలకు అర్హత సాధించని వ్యక్తులు మళ్ళీ స్లాటు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్