విశాఖపట్నం : జగన్ వద్ద తనను దుర్మార్గుడిగా చిత్రీకరించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని మాజీ ఎంపి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రజలపై వైఎస్‌ఆర్‌సిపి నేతలది బూటకపు ప్రేమ అని అన్నారు. మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని.. దీనికి కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డేనని చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో తనకు తెలిసిందంతా అధికారులకు చెప్పానని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్‌ఆర్‌సిపికి నష్టం జరుగుతోందన్నారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదన్నారు. ఆ పార్టీ హయాంలో తాను కీలకపాత్ర పోషించాననే వార్తలు అవాస్తవమని అన్నారు.అధికారంలోకి వచ్చేంతవరకు పార్టీ తనను వాడుకుందని, అనంతరం తనపై కుట్రలు, దుష్ప్రచారం చేసిందని అన్నారు. మూడు నెలల్లో తనను పక్కనపెట్టారని అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి వైఎస్‌ఆర్‌సిపి మాటమార్చిందని, ఇప్పుడు మావిగన్ అంటోందని అన్నారు. ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పిన వైఎస్‌ఆర్‌సిపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపిని ప్రస్తుత ఇన్‌ఛార్జ్ గెలిపించగలరా అని ప్రశ్నించారు. త్వరలో పార్టీ పేరును ప్రకటిస్తానని.. ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని విజయ్‌సాయిరెడ్డి అన్నారు.
నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించింది సజ్జల రామకృష్ణా రెడ్డి : విజయసాయి రెడ్డి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)