శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సచివాలయ హౌస్ కీపింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలి

6 రోజుల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 10:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి నారాయణకు సిఐటియు రాష్ట్ర కమిటి వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీలో పనిచేయుచున్న హౌస్ కీపింగ్ కార్మికులకు పెరిగిన ధరల కనుగుణంగా వేతనాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి ముత్యాలరావు, రాజధాని డివిజన్ కార్యదర్శి బి లక్ష్మణరావు శనివారం విజయవాడలో కలిసి వినతిపత్రం అందజేశారు. తక్కువ వేతనంతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ సచివాలయంలో పనిచేసే కార్మికులకు ఏడేళ్ల నుంచి వేతనాల పెంపు లేదన్నారు. దీంతో వారి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు కనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు. కార్మికుల వేతనాల పెంపుపై సిఆర్‌‌డిఎ కమిషనర్‌, ఏజెన్సీ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వారికి హామీ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్