మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి : సిఐటియు రాస్తారోకో

1 గంట క్రితం

Municipal workers' issues must be discussed in the Assembly: CITU stages 'Rasta Roko'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 03:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆగస్టు 17 నుంచి జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు, మినిమం టైం స్కేల్ అమలు, పర్మినెంట్, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు, థర్డ్ పార్టీ కార్మికులకు ఆప్కాస్ జీతాలు, 1972 చట్టం ప్రకారం గ్రాట్యూటీ తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరం మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్లి, గంట స్తంభం వద్ద రాస్తారోకో నిర్వహించారు..కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. జగన్మోహన్రావు మాట్లాడుతూ 60 ఏళ్లకే పైసా ఇవ్వకుండా కార్మికులను రిటైర్మెంట్ చేస్తున్నారని, ఆప్కాస్ లో ఉద్యోగి అని నమోదు కావడంతో ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగమే పదాన్ని తొలగించి రిటైర్మెంట్ అయిన కార్మికులకు వృద్ధాప్య పెన్షన్, మరణించిన కార్మికుల భార్యలకు విడో పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ జి .కుమారి, రమా, నాగమ్మ, రామచంద్రరావు, రాఘవ, శంకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్