ప్రజాశక్తి-విజయనగరం టౌన్: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న విజయవాడ గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్ సమీపంలోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్‌లో 8వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించనున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికల కోసం సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు కంటోన్మెంట్‌లోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్ వద్ద విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పారా స్విమ్మింగ్ క్రీడాకారులకు ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని, మహిళలు, పురుషులకు వేర్వేరు విభాగాల్లో ఎంపికలు ఉంటాయని చెప్పారు. అర్హత, ఆసక్తి ఉన్న పారా స్విమ్మింగ్ క్రీడాకారులు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు 9849377577 నంబర్‌ను సంప్రదించాలని దయానంద్ సూచించారు.








కామెంట్‌లు (0)