mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బీచ్‌ల దగ్గర మద్యం అమ్మకాలు సిగ్గుచేటు

14 గంటల క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 10:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తీరప్రాంత పర్యాటక అభివృద్ధి ముసుగులో, బీచ్ ఫ్యాక్స్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బీచ్‌ల దగ్గర మద్యం వ్యాపారం చేయడం సిగ్గుచేటు అని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వై. రాము, జి. రామన్న గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లను మొదటగా బార్ కు లైసెన్స్ ఇచ్చే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు, మహిళలు, కుటుంబాలతో విశ్రాంతి కోసం,వినోదం కోసం, స్వేచ్ఛగా విహరించే బీచ్‌లను మద్యం విక్రయ కేంద్రాలుగా మార్చాడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.వినోదం కోసం బీచ్‌‌కు వచ్చే చోట మద్యం అమ్మకాలు చేస్టే మహిళలకు ఎటువంటి రక్షణ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీర్ సంపూర్ణ మద్య నిషేధం చేస్తే ఇప్పుడు చంద్రబాబు సంపూర్ణంగా మద్యం తాగండి అనడం సిగ్గుచేటు విమర్శించారు. పర్యాటక అభివృద్ది పేరుతో ఇలాంటి తప్పుడు ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చేతనైతే ప్రతి బీచ్ దగ్గర త్రాగునీరు, మరుగుదొడ్లు, లైవ్ గార్డులు, పరిశుభ్రత, పిల్లల ఆట స్థలాలు, భద్రత వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని హితవు పలికారు. విశాఖపట్నం ఎంపీ భారత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం తాగితే తప్పు ఏంటి అని చెప్పడమే కాకుండా రాత్రి 12 గంటల వరకు మద్యం తాగేందుకు అవకాశం ఇవ్వాలని పార్లమెంట్‌ ‌సభ్యుడిగా ఉన్న వ్యక్తి కోరడం సభ్య సమాజం సిగ్గుపడుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఉపాధి పేరుతో రాష్ట్రంలో భూ మాఫియా జరుగుతుందని విమర్శించారు. లక్షల్లో ఖాళీలు ఉంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నీతి సూక్తులు వల్లించడం తగదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాలో ఉపాధి పరిశ్రమల పేరుతో తీసుకున్న లక్షలాది ఎకరాల్లో భూములు లాక్కున్నరని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేయని భూములు పేదలకు అప్పగించాలని లేదంటే నిరుద్యోగులతో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. కోట్ల విలువ చేసే భూములు బడా కార్పొరేట్లకు అప్పగించడం అన్యాయం అని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్