న్యూఢిల్లీ : మాజీ మంత్రి, వైసిపి నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎపి మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కారుమూరి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కారుమూరి తరఫు న్యాయవాది సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అయితే ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం మద్యం స్కామ్‌లో రూ.350 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో కనిపిస్తోందని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే కస్టోడియల్ విచారణ అవసరమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మాజీ మంత్రి కారుమూరికి సుప్రీంలో చుక్కెదురు
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 12:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)