- సంస్మరణ సభలో పలువురు వక్తలు
ప్రజాశక్తి-నందిగామ : యార్లగడ్డ జోయ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఎం నందిగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నందిగామ ఎస్ టియు భవనంలో జోయ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెుండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. యార్లగడ్డ జోయ తనకు మాతృమూర్తితో సమానమని, జోయ పేరులోనే జోష్ ఉందని, రష్యా వీరనారి జోయ స్ఫూర్తితో నందిగామ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ... పెట్టుబడి, దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా జోయ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. అంతకుముందు ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి ప్రచురించిన కామ్రేడ్ యార్లగడ్డ జోయ సంస్మరణ ప్రత్యేక సంచికను ఆమె పెద్ద కుమారుడు యార్లగడ్డ సత్య నారాయణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మెుండితోక జగన్ మోహన్ రావుతో కలిసి సిపిఎం నాయకులు ఆవిష్కరించారు.








కామెంట్‌లు (0)