హైదరాబాద్: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కాట్రావత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వశ్రామ్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లింబ్యా, మాన్‌సింగ్, వశ్రామ్ వ్యాపారులు కాగా, జమున గృహిణి. కారు డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Shamshabad: కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)