మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్’ అందించాలి

3 రోజుల క్రితం

tnus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం డిమాండ్

- రిజర్వేషన్‌ కోటాను సక్రమంగా అమలు చేయాలి - బిటిఎ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్’ అందించాలి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ప్రతి మండలంలో ఆరుగురు విద్యార్థులకు రూ.20 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రంతో షైనింగ్ స్టార్ అవార్డ్స్ అందజేయడం అభినందనీయమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 80 శాతం అవార్డులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకే దక్కుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అక్కడ చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో అవార్డ్సను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అందించేలా మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 లలో రిజర్వేషన్ల కోటాను సక్రమంగా అమలు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌కి సంఘం రాష్ట్ర అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్ వినతి పత్రాన్ని అందజేశారు. ఎక్కువ మార్కులు సాధించిన ఎస్సి, ఎస్టి, బిసిలను పక్కనపెట్టి ఓపెన్ క్యాటగిరిలో ఓసి కులస్తులకు మాత్రమే ఎంపిక జరిగిందని, ఇది భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి ఎక్కువ మార్కులు సాధించిన ఎస్సి, ఎస్టి, బిసి విద్యార్థులను ఓపెన్ క్యాటగిరి లో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్