ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముర్రం శివాని బలవన్మరణానికి పాల్పడటం తనను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని ముఖ్యమ ంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని తనువు చాలించడం ఆవేదన కలిగించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. ఆ రోజు చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని తనతో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ ఇలా మరణించడం బాధాకరమని అన్నారు. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్థిని దూరమవ్వడం తనను కలచివేస్తోందన్నారు. శివాని మృతి పట్ల పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలొచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలని, ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకు లోనుకావొద్దని కోరారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలూ అండగా ఉంటుందని తెలియజేశారు.
Print Editionశివాని మృతి కలచివేసింది : సిఎం చంద్రబాబు విచారం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)