విజయవాడ : గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాదిరే ఈ ఏడాది కూడా తెలుగు షార్ట్ ఫిల్మ్, రీల్స్ పోటీలు జరపాలని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్ణయించింది. చిన్న సినిమా - పెద్ద సందేశం "లైన్"తో ఈ పోటీలు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే)లో నిర్వహిస్తున్నట్టు "అసోసియేషన్" ప్రధాన కార్యదర్శి డి.వి.రాజు, నాయకులు ఇక్కడి బాలోత్సవ భవన్లో శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పోటీల బ్రోషర్ ను ఆవిష్కరించారు. ప్రశ్న పత్రాల లీకు - వాటి ప్రభావం, శ్రమ గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్), మహిళలు - వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలపై ధరల ప్రభావం, విద్యా.. వైద్యం.. వ్యాపారమయం, కుల నిర్మూలన, భిన్నత్వంలో ఏకత్వం, ప్రపంచంపై అమెరికా పెత్తనం, దురాక్రమణ యుద్ధాలు, ఏకపక్ష సుంకాలు, మత విభజనలు - ప్రజల ఐక్యత, పర్యావరణం ధ్వంసం - ప్రజలపై దాని ప్రభావం, భారత రాజ్యాంగం పరిరక్షణ అంశాలపై మూడు - పది నిమిషాల నిడివిలో, రీల్స్ రెండు నిమిషాల లోపు చిత్రాలు తీయాలి. షార్ట్ ఫిల్మ్ పోటీలకు వరసగా మొదటి మూడు బహుమతులకు రూ. పది వేలు, ఏడు వేలు, ఐదు వేలు, రీల్స్ పోటీలకు రూ.ఐదు వేలు, మూడు వేలు అందిస్తారు. నిర్మాణంలో ఏఐ ప్రక్రియనుపయోగించకూడదని నిర్వాహకులు స్పష్టంచేశారు. సెప్టెంబర్ 20లోగా telugusfa@gmail.com కు షార్ట్ ఫిల్మ్ రూ. 300/, రీల్ రూ. 200/ ఎంట్రీ ఫీజు 99858 02469 (పి. జగదీష్)కు పంపాలి. '26 సెప్టెంబర్ 27 (ఆదివారం) ఉ. 10 గంటల నుండి షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన ఎంబీవీకే చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం (ఎ.సి.)లో ప్రదర్శిస్తారు. ఇతర వివరాలకు బి.కె.ఎన్.ఎస్.ప్రసాద్ (9440497672), పి.ఐజాక్ న్యూటన్: (8885000171), డి.వి.రాజు : (9391163508)లను సంప్రదించొచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో పి.ఐజక్ న్యూటన్, కృష్ణతేజ, వలి నాగరాజు, ఎస్కే షహనాజ్ , పొట్లూరి మోహన్ రాంప్రసాద్, భార్గవ్ రాయ్, దినేష్ పిన్నమనేని, ఫ్లాష్ రామారావు, అశోక్, జగదీష్, నితిన్, మహేష్, సాయి తేజ, డూండీ అవినాష్, కిరణ్ ధగాని కూడా పాల్గొన్నారు.
షార్ట్ ఫిల్మ్, రీల్స్ పోటీలు
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 05:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)