గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తక్షణం రెగ్యులరైజ్ చేయాలి

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 01:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాంట్రాక్ట్ హెల్త్ సిబ్బంది సమ్మెకు సిఐటియు మద్దతు

- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు

ప్రజాశక్తి-విశాఖ: ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీగా రాష్ట్రవ్యాప్తంగా నేటికీ మూడు రోజులుగా 14,600 మంది సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని, వారిని న్యాయమైన సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కేజిహెచ్ సమ్మె శిబిరానికి నర్సింగరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మెను పరిష్కారం చేయకుండా, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇచ్చిన షోకాజ్ నోటీసులను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల బెదిరింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 16 సంవత్సరాలుగా మెడికల్ అండ్ హెల్త్ లో డైరెక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయమని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ప్రత్యక్షంగా ఈ సమ్మెలో పాల్గొంటుందని ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అన్ని విధాలుగా అండదంటలుగా ఉంటామని హామీ ఇచ్చారు. సిహెచ్ నర్సింగ్ రావుతో పాటు విశాఖ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్, జిల్లా కోశాధికారి ఎస్ జ్యోతిశ్వరరావు, ఉపాధ్యక్షులు పి మణి, పి వెంకట్రావు గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్