ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టిజిఎస్) కేంద్రాన్ని సింగపూర్ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. సచివాలయంలోని ఆర్‌టిజిఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ బృందం తిలకించింది. సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక విభాగం అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టన్ ఇంగ్ ఫెండ్ నేతృత్వంలో వచ్చిన ఈ బృందానికి ఆర్‌టిజిఎస్ అధికారులు స్వాగతం పలికారు. ఆర్‌టిజిఎస్ పనితీరును ఆ బృందానికి వివరించారు. డేటా డ్రివన్ గవర్నెన్స్ ఆశయాలు, డేటా లేక్, డేటా లెన్స్ తదితర కార్యకలాపాల గురించి ఆర్‌టిజిఎస్ అధికారులు వివరించారు. సింగపూర్ ప్రభుత్వం డేటా సమర్థ వినియోగంతో నిర్వహిస్తున్న కార్యకలాపాలను ప్రతినిధి బృందం వివరించింది. ఈ సమావేశంలో ఆర్‌టిజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్, డిప్యూటీ సిఇఒ ఎం మాధురి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు పి శ్రీఖర్, కె చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Print Editionసింగపూర్ బృందం ఆర్‌టిజిఎస్ సందర్శన
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)