సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పోర్స్ట్‌ కోటా అభ్యర్ధులకు స్కిల్‌ టెస్ట్‌

18 సెప్టెంబర్, 2026

sap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇఎపిసెట్‌‌లో నిర్వహణ

- ‘డిఎస్సి’పై విమర్శలు నేపథ్యంలో శాప్‌ నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్పోర్స్ట్‌ ‌కోటాలో భర్తీ చేసే సీట్లకు ఆంధ్రప్రదేశ్‌ ‌క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) తొలిసారి స్కిల్‌ టెస్ట్‌ ‌ నిర్వహించనుంది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఇఎపిసెట్‌)‌లో ఈ పరీక్ష విధానాన్ని తొలిసారి అమలు చేయనుంది. ప్రవేశపరీక్షల్లో స్పోర్ట్స్‌ ‌కోటాను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. క్రీడా సంఘాలు ఇచ్చిన పత్రాలను బట్టి అభ్యర్ధులు అర్హులా? కాదా? అని ఎలాంటి పరీక్ష ‌నిర్వహించకుండానే శాప్‌ ప్రవేశ పరీక్షల్లో అడ్మిషన్ల కమిటీకి జాబితా అందజేస్తోంది. శాప్‌ అందించిన జాబితాను బట్టి అడ్మిషన్ల కమిటీ విద్యార్ధులకు సీట్ల కేటాయింపు ప్రతి ఏటా చేస్తోంది. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి-2025లో అవినీతి జరిగిందని పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రీడా కోటాలో ఈ విమర్శలు వచ్చాయి. అర్హత లేకపోయినా స్పోర్ట్స్‌ ‌కోటాలో కొంతమందికి టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చినట్లు పెద్దఎత్తున దూమరం రేగింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌ ‌కోటాలో భర్తీ చేసే సీట్లకు స్కిల్‌ ‌టెస్ట్‌ ‌నిర్వహించాలని శాప్‌ ‌నిర్ణయించింది. ఇఎపిసెట్‌ అడ్మిషన్లలో స్పోర్ట్స్‌ ‌కోటా కింద ప్రాథమిక జాబితాలో క్రీడా ప్రాధాన్యత కేటాయించిన అభ్యర్ధులకు ఈ నెల 21వ తేదిన స్కిల్‌ ‌టెస్ట్‌ ‌నిర్వహిస్తునట్లు శాప్‌ ‌శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సంబంధిత క్రీడల్లో అనుభవం కలిగిన శిక్షకులు, ఫిజికల్‌ ‌డైరెక్టర్లతో ఉదయం 8. 30 గంటల నుంచి స్కిల్‌ ‌పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ టెస్ట్‌‌కు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్