ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత్-ఇజ్రాయెల్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కింద ఎస్సి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌ఎస్‌డిసి, ఎపిఎస్‌సిసిఎఫ్‌సి ఆధ్వర్యంలో ఎఎన్‌ఎం, జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సి మహిళా అభ్యర్థులకు 100 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఇంగ్లీష్ భాష, డొమైన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు పట్టణాల్లో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. స్వయం ఉపాధి, వివిధ రంగాల్లో ప్లేస్‌మెంట్ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురంలలో మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షణ కేంద్రాలకు దగ్గరలో ఉన్న హాస్టళ్లలో భోజన, వసతి సౌకర్యాల కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన ఖర్చులను సాంఘిక సంక్షేమ శాఖ డైట్ బడ్జెట్ నుంచి భరించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఎస్సి యువతకు విదేశాల్లో ఉపాధికి నైపుణ్య శిక్షణ
31 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)