శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ర్టానికి స్కోచ్‌ అవార్డులు

31 నిమిషాల క్రితం

రాష్ర్టానికి స్కోచ్‌ అవార్డులు 
- మీడియా అక్రిడిటేషన్‌కు సిల్వర్ స్కోచ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 10:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మీడియా అక్రిడిటేషన్‌కు సిల్వర్ స్కోచ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ర్టానికి పలు జాతీయ పురస్కారాలు దక్కాయి. సమాచార, పౌరసంబంధాలశాఖకు మీడియా అక్రిడిటేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో పారదర్శకతకు సిల్వర్‌ స్కోచ్‌ అవార్డు లభించింది. జాయింట్‌ డైరెక్టరు ఐ సూర్యచంద్రరావు, ఆర్‌ఐఇ నాగరాజు శనివారం ఢిల్లీలో అవార్డులు అందుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌కు ఎపి డిజిటల్‌ కార్పొరేషన్‌కు గోల్డ్‌ స్కోచ్‌ అవార్డు దక్కింది. ఎపి సోషల్‌ ఆడిట్‌ సంస్థకు గుడ్‌ గవర్నెన్స్‌లో గోల్డ్‌, అమలాపురం మున్సిపాలిటీకి పట్టణాభివృద్ధి, పౌర సేవల్లో పురస్కారం లభించాయి. ఎపి గ్రామీణ బ్యాంక్‌ పేస్‌ పే అమలులో భాగంగా ఐటి ఇన్నోవేషన్‌ విభాగంలో సిల్వర్‌ స్కోచ్‌ అవార్డు సాధించింది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్