ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం) : ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సిఐ బాలకృష్ణ తెలిపిన కథనం మేరకు.. జివిఎంసి ఐదో వార్డు పరిధి మారికవలసలోని విశ్వనాథ్ అవెన్యూస్ అపార్టుమెంట్‌లో గోరాపల్లి చైతన్య (29), ఆయన భార్య ఝాన్సీ నివాసముంటున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో చైతన్య పనిచేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం ఆయన తండ్రి రవి కుమార్ మరణించారు. తండ్రి చనిపోవడం, పని ఒత్తిడి ఎక్కువవడంతో చైతన్య తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పక్క గదిలోకి వెళ్లిన చైతన్య లోపల గడియ పెట్టుకుని సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకున్నారు. ఝాన్సీ పొరుగువారి సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఆయన మృతి చెందారు. మానసిక ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై ఎలాంటి అనుమానాలూ లేవని పోలీసులకు ఝాన్సీ తెలిపారు. ఎస్ఐ శ్రావణి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
11 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)