సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఎంకు వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీ వర్కర్స్‌కు కనీస వేతనాలు, పెన్షన్, పిఎఫ్, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్‌ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి, ఆ సంఘ అధ్యక్ష‍ ప్రధాన కార్యదర్శులు జి. బేబిరాణి, కె. సుబ్బరావమ్మ వినతి పత్రాన్ని సోమవారం మెయిల్ ద్యారా పంపారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తైనా అంగనవాడీలను కార్మికులుగా గుర్తించలేదని పేర్కొన్నారు. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వర్కర్‌కు రూ.24,800, హెల్పర్‌కు రూ.20,300 ఇవ్వాలన్న తీర్పును అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, 42 రోజుల చారిత్రాత్మక సమ్మె సందర్భంగా 2024 జూలై నెలలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, ఒప్పందం చేసుకున్నా.. ప్రభుత్వం అమలు చేయడంలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా నేటికి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచలేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉ్నన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని తెలిపారు. పని భారం పెంచే నవచేతన యాప్‌ను రద్దు చేసి, పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఎల్ఓ డ్యూటీల నుండి అంగన్‌వాడీలకు మినహాయించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీల అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా ఈ నెల 10 తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్