సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామీణ తాగునీటి వనరుల పరిరక్షణకు ఎస్‌ఒపి

06 జులై, 2026

jal jeevan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జల్ జీవన్ మిషన్ రెండవ విడత మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామీణ తాగునీటి వనరుల స్థిరత్వం, వ్యర్ధ జలాల నిర్వహణ కోసం రూపొందించిన ప్రామాణిక నిర్వహణ విధానాలకు (ఎస్‌ఒపి) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ ‌దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పెంపొందించడం, నీటి వనరుల సంరక్షణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్ధ జలాలను శాస్త్రీయంగా నిర్వహించడం వంటి అంశాలను ఈ ఎస్‌ఒపిలో పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విధానాల సమర్థ అమలుకు ఈ ఎస్‌ఒపి మార్గదర్శకంగా ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో పాటు గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి సరఫరాను దీర్ఘకాలికంగా కొనసాగించడం, నీటి వనరులను సంరక్షించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా వ్యర్ధ జలాల నిర్వహణను బలోపేతం చేయడం ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్