శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరిగిన డెంగ్యూ,మలేరియా కేసులు

13 సెప్టెంబర్, 2026

satya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరిగాయని వెల్లడించారు. ఆగస్టు 30 నాటికి రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు, మలేరియా కేసులు 7,895 నమోదయ్యాయని తెలిపారు. డెంగ్యూ గతేడాది 1410 కేసులు నమోదయ్యాయని, గతేడాది పోలిస్తే 4.6శాతం పెరిగాయని పేర్కొన్నారు. మలేరియా గతేడాది 6,172 కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 6172 కేసులు ఉన్నాయని ,గతేడాది కంటే 27.9శాతం పెరిగాయని వివరించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం ప్రాంతాల్లో మలేరియా కేసులు కాస్త పెరిగాయని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో దోమల నివారణ, దోమల పిల్లలను తొలగించడం, జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు చేయడం వంటి చర్యలను పెంచుతునట్లు వివరించారు.

​స్క్రబ్‌ టైఫస్‌పై ప్రత్యేక దృష్టి

​ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 941 స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేసులు 13 నుంచి 44కు, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 నుంచి 47కు పెరిగాయని వెల్లడించారు.అటవీ ప్రాంతాల సమీపంలో జ్వరంతో బాధపడుతున్న వారికి త్వరగా పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందేలా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో తాగునీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల కేసులు గతేడాది 34 ఉండగా, ఈ ఏడాది 408కు పెరిగాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది టైఫాయిడ్‌ కేసుల కాస్త ఎక్కువగా నమోదయ్యాయని, దీంతో తాగునీటి వనరులను అధికారులు పరిశీలించనున్నారని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించిన 930 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్