ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా, 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రటకనలో వెల్లడించారు. 5 రోజులపాటు 10 సెషన్‌లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి) విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 64, పొరుగు రాష్ట్రాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరగనుందన్నారు. పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్‌లో ఉన్నాయని, అధికారిక వెబ్‌సైట్ http://cse.ap.gov.in/, http://tet2dsc.apcfss.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందుగానే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Print Editionనేటి నుంచి ప్రత్యేక టెట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)