ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మహిళా ఉద్యోగుల రాష్ట్ర సదస్సు ఈ నెల 25వ తేదీన రెవెన్యూ భవన్లో జరుగుతుందని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ రెవెన్యూ భవన్లో శనివారం మహిళా విభాగం రాష్ట్రస్థాయి సదస్సు సన్నాహక సమావేశం జరిగింది. మహిళా సదస్సు ఏర్పాట్లు, 2026–29 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గ ఎంపికపై సమావేశంలో చర్చించారు. మహిళా ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, సమాన అవకాశాల సాధనకు మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, శాఖల నుంచి మహిళా ఉద్యోగులు, సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు కోరారు. ఈ సమావేశంలో జెఎసి అసోసియేట్ ఛైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 25న మహిళా ఉద్యోగుల రాష్ట్ర సదస్సు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)