ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.20 కోట్లతో రాష్ట్ర గ్రంథాలయం ఆధునీకరణ

1 గంట క్రితం

pemmasani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరులోని రాష్ర్ట ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధునీకరణలో భాగంగా పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్‌ ‌రూ.20 కోట్ల ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న భవనాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సమక్షంలో ప్రభుత్వంతో ఆదివారం ఎంఒయు కుదిరింది. ఎంఒయు పత్రాలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధికారులు, రాజేంద్ర ప్రసాద్‌ మార్చుకున్నారు. జిప్లస్‌‌టు గ్రంథాలయ భవనం ఉండేలా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ 1915 సంవత్సరం బ్రిటిష్ పాలన సమయంలో ఈ గ్రంథాలయం ఏర్పడిందని తెలిపారు. దాదాపు 110 సంవత్సరాలకు పైగా ఇదే భవనంలో రాష్ట్ర గ్రంథాలయం నిర్వహించబడుతోందని వివరించారు. రాష్ర్ట స్థాయిలో ఎన్నో గ్రంథాలు, పుస్తక బాంఢాగారం ఇక్కడ ఉన్నట్లు పేర్కొన్నారు. లక్షలాదిమంది విద్యార్థులకు ఈ లైబ్రరీ ఆసరాగా నిలుస్తోందని తెలిపారు. భవనం పాడైపోయిన నేపత్యంలో రాజేంద్ర ప్రసాద్‌ ‌సహకారంతో నిర్మాణం చేపడుతున్నామని, భవన నిర్మాణం పూర్తయ్యే లోగా ఇక్కడ చదువుకునే వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ ‌వర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌భీమినేని వందనాదేవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్