సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అటవీ సిబ్బందిపై దాడికి కఠిన చర్యలు

13 సెప్టెంబర్, 2026

pawan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అటవీ సిబ్బంది గాయపడిన ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారిపల్లి సమీపంలో ‘ఆపరేషన్‌ అరణ్య’లో భాగంగా విధులు నిర్వహిస్తోన్న అటవీ సిబ్బంది వాహనాన్ని ఎర్రచందనం స్మగ్లర్లు ఢీకొట్టిన ఘటనను ఆయన ఆదివారం ఎక్స్ ద్వారా తీవ్రంగా పరిగణించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కె ప్రకాష్‌కుమార్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు పి రెడ్డి ప్రసాద్‌, కె ప్రతాప్‌, అటవీ సిబ్బంది వాహన డ్రైవర్‌ చరణ్‌ గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని, చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. సిబ్బంది పూర్తిగా కోలుకునే వరకు అటవీ ముఖ్య సంరక్షణాధికారి (పిసిసిఎఫ్) పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘ఆపరేషన్‌ అరణ్య’లో భాగంగా ప్రాణాలకు తెగించి ఇద్దరు నిందితులను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకోవడాన్ని అభినందించారు. వారి నుంచి ఎర్రచందనం దుంగలు, తూకం యంత్రం, రంపం బ్లేడ్‌, గొడ్డళ్లు, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంపై ప్రశంసలు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను త్వరగా పట్టుకోవాలని రెడ్‌ శాండర్స్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్