ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి

16 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 11:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రియాంక హంతకులను కాపాడేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు

- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండు రోజుల్లోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ​రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వాటికి యాజమాన్యాలు వ్యవహరించిన తీరు ప్రధాన కారణంగా ఉంటోందని పేర్కొన్నారు. కాకినాడ శ్రీ చైతన్య కళాశాల ఇంటర్ విద్యార్థి అరవింద్, విజయవాడ శరత్ చంద్ర అకాడమీలో డిగ్రీ చదువుతున్న భాగ్యశ్రీ, గుడివాడ ఆయుర్వేద కళాశాల విద్యార్థి లక్ష్మీ తులసి, శనివారం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి శేషు ఇలా ఈ రెండు రోజుల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తి విఫలం చెందిందని పేర్కొన్నారు. 2025లో సుప్రీంకోర్టు సుఖదేవ్ సహా ఇచ్చిన జడ్జిమెంట్లో వంద మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నచోట్ల కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు. ఫిర్యాదుల చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్న మార్గదర్శకాలను ఏ ఒక్క కళాశాల ఖాతరు చేయడం లేదని, ప్రభుత్వం ప్రకటనలు, కమిటీలకే పరిమితమవుతోందని వాపోయారు. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ విద్యార్థి ప్రియాంక హంతకులను కాపాడేందుకు అధికార యంత్రాగం శతవిధాలా ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకొని, ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్