గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీకటి గోపి మృతిపై సిట్ విచారణ ప్రారంభం

43 నిమిషాల క్రితం

చీకటి గోపి మృతిపై సిట్ విచారణ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - తాడికొండ (గుంటూరు జిల్లా) : దొంగతనం కేసులో గతనెల గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల దెబ్బలకు తాళలేక అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతి చెందిన పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ చేపట్టింది. బృంద సభ్యులు గురువారం పొన్నెకల్లులో పర్యటించారు. గోపీ మృతికి గల కారణాలను అతని భార్య జ్యోతి వద్ద నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి గోపికృష్ణ, తల్లి నిర్మల, తమ్ముడు సతీష్ వద్ద నుండి వారి స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డు చేసుకున్నారు. పోలీసులు కొట్టిన కారణంగానే గోపి మృతి చెందాడని భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల దెబ్బల వల్ల మృతి చెందలేదని, అనారోగ్యంతో మృతి చెందాడని పోలీసులు చెప్పడంతో కెవిపిఎస్‌, ఎంఆర్‌‌పిఎస్‌, ప్రజాసంఘాలు ఆందోళనలు చేశాయి. ఇటీవల గుంటూరు జిల్లా ఎస్‌‌పి వకుల్‌ ‌జిందాల్‌తో మంద కృష్ణమాదిగ, ఆండ్ర మాల్యాద్రి, కొరివి వినయ్‌ ‌కుమార్‌ ‌తదితరులు సమావేశమై గోపీ మృతి గురించి వివరించారు. దీంతో దర్యాప్తునకు ఎఎస్‌‌పి రవికుమార్, డిఎస్‌‌పి పూర్ణచంద్రరావు, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ అశోక్‌‌తో సిట్‌‌ను ఎస్‌‌పి ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్