బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జువైనైల్ జస్టిస్ యాక్ట్‌ సవరణలపై సూచనలకు ఆహ్వానం

31 జులై, 2026

juvilen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాలల సంరక్షణ, పునరావాస చట్టపరమైన ప్రక్రియలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జువైనైల్ జస్టిస్ యాక్ట్‌కు అవసరమైన సవరణలు, కొత్త ప్రతిపాదనలపై సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంద‌ని ఎపి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, సంస్థలు, భాగ‌స్వామ్య‌దారులు, బాలల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు నిర్ణీత ఫార్మాట్‌లో తమ సలహాలు, సూచనలను సకాలంలో సమర్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర‌స్థాయిలో సూచనలు, ప్రతిపాదనలను ఆగస్టు 7వ తేదీ నాటికి apscpcr2018@gmail.com కు సమర్పించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్