శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతిలో చెస్ అకాడమీకి సహకరించండి

8 గంటల క్రితం

అమరావతిలో చెస్ అకాడమీకి సహకరించండి 
-మంత్రి లోకేష్‌‌కు కేనేరు హంపి వినతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి లోకేష్‌‌కు కేనేరు హంపి వినతి

ప్రజాశక్తి - తాడేపల్లి (గుంటూరుజిల్లా) : విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆమె తండ్రి అశోక్ శుక్రవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంత్రి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి బోర్డు-1లో కాంస్య పతకం కైవసం చేసుకోవడం పట్ల లోకేష్‌ అభినందనలు తెలిపారు. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున మద్దతుగా నిలవాలని కోరిన విజ్ఞప్తి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని కోనేరు హంపి తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్