- ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాల్సిందే
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అయితే, సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాల్సి ఉంది. ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఎస్‌ఐఆర్ జాబితా వెలువడితే తాజా జాబితాతో ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొంది. లేదా పాత జాబితాతోనే ఎన్నికలకు వెళ్లాలని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే... ఏ ఓట్ల జాబితాతో ఎన్నికలు నిర్వహింస్తుందో అనేది ఆసక్తి నెలకొంది.







కామెంట్‌లు (0)