గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

20 జులై, 2026

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 66.7 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్