శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 09:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కళాశాల హాస్టల్లో సంఘటన

ప్రజాశక్తి -విజయపూరి సౌత్ (పల్నాడు జిల్లా) : ​అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్‌ ‌విద్యార్థి మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం అలుగురాజుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మార్కాపురం జిల్లా పెద్దవీడు మండలం భద్వీడు చర్లపల్లి గ్రామానికి చెందిన వెన్నా ప్రసాద రెడ్డి (20) న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్‌‌సి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అదే కళాశాలలోని హస్టల్‌‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయంలో తన రూంలో ‌ఉరి వేసుకొని ఉన్నారు. విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆత్మహత్యకు కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. మృతుడి తండ్రి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్