ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన తరుణ్ (బీటెక్ ద్వితీయ సంవత్సరం) పై కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తిరుపతి నగర పరిధిలోని ఎమ్మార్పల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు కళాశాల ప్రధాన రోడ్డు మార్గంపై అతనిని అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు, మరి కొంతమంది 108 ద్వారా వైద్య చికిత్స కోసం రుయ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్విసిఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ పై కత్తులతో దాడి
07 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)