ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తమ్మినేనిని వెంటనే అరెస్ట్ చేయాలి

20 జులై, 2026

varla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 11:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి పొలిట్‌‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి నేత, మాజీ స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాంను వెంటనే అరెస్టు చేయాలని టిడిపి పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ ‌చేశారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ్మినేని సీతారాం చేసిన అక్రమాలు, భూకబ్జాలు, ఫోర్జరీ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతోనే ఆయన కుటుంబంతో సహా పారిపోయారని ఆరోపించారు.తమ్మినేని ఎక్కడ ఉన్నారో చెప్పే దైర్యం జగన్‌‌కు ఉందా అని ప్రశ్నించారు. వైసిపి అధినేత దగ్గరి నుంచి ఆ పార్టీలో ఉన్న మెజారిటీ నాయకుల పెద్ద చిట్టా, జాతకాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. తమ్మినేని చేతులకు పోలీసులు బేడీలు వేసి నడిపించుకుంటూ తీసుకురావాలని అన్నారు. తల్లికి వందనం పథకం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అంగన్‌‌వాడీలకు అండగా నిలిచిందని టిడిపి నాయకురాలు ఆచంట సునీత మరో సమావేశంలో అన్నారు. సుమారు 17వేల మంది అంగన్‌‌వాడీ కార్యకర్తల పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో దేశానికి ఎపి ఆదర్శంగా ఏదిగిందని టిడిపి నేత అప్పాసాని రాజేష్‌ అన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్