సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బిసిల అభ్యున్నతి టిడిపి లక్ష్యం

1 గంట క్రితం

savitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జగన్ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాల అమలు

- ​ మంత్రి సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ​బిసిల అభ్యున్నతే టిడిపి లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బిసిలకు మరోసారి మంచి రోజులు ప్రారంభమయ్యాయని మంత్రి సవిత అన్నారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు బడ్జెట్లలో రూ.1.37 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించడం చరిత్రలోనే తొలిసారి చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 109 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.కొత్తగా 10 గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం, భోజనం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం సాస్సీ నిధుల ద్వారా రూ.500 కోట్లు కేటాయించామన్నారు. 2014–19లో మంజూరు చేసిన గురుకులాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.30 కోట్లతో వాటి నిర్మాణాలు పూర్తి చేయనునట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో "తన బీసీలు" అంటూ అధికారంలోకి వచ్చిన మాజీముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌‌మోహన్‌ ‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదంతో అణచివేశారని ఆరోపించారు. జగన్‌ నోటి వెంట 'హే రామ్' అనే పదం తరచూ వినిపిస్తోందని, ఇది రాజకీయాల్లో వాడుకునే స్లోగన్‌ ‌కాదని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌బుచ్చి రాంప్రసాద్‌ మరో సమావేశంలో అన్నారు. తమ ప్రభుత్వంపై బురద చల్లడానికి వైసిపి ముఠా నిత్యం కుట్రలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. దళితుల పట్ల జగన్‌ ‌చూపే ప్రేమ ఎడారిలో ఎండమావిలాంటిదని టిడిపి పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మరో సమావేశంలో అన్నారు. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ జగన్‌ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్