శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సింగరేణి ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

1 గంట క్రితం

singareni.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ..!

హైదరాబాద్‌:  సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణి ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది రేవంత్‌ సర్కార్‌.  ఒక్కో కార్మికుడికి గరిష్టంగా  రూ.1,10,250 దీపావళి బోనస్‌ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 

దీపావళి బోనస్ కోసం రూ.419 కోట్లు  సింగరేణి యాజమాన్యం విడుదల చేయనుంది. సుమారు 38 వేల మంది సింగరేణి కార్మికులకు బోనస్‌ అందనుంది. నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ అయ్యే అవకాశం ఉంది. దసరా, దీపావళి బోనస్‌లతో సింగరేణి కార్మికులకు నెల రోజుల్లోనే భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లయ్యింది. రెండు బోనస్‌ల రూపంలో ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. దసరా, దీపావళి బోనస్‌లతో కలిపి కార్మికులకు సుమారు రూ.1,020 కోట్ల చెల్లిస్తున్నారు. దీనిలో భాగంగా సింగరేణి కార్మికులకు ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి పోటీని అధిగమించాలని సింగరేణి కార్మికులకు సూచించారు.  బోనస్ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు పొదుపు చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్