మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుప్పంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట

1 రోజు క్రితం

పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు

ప్రజాశక్తి-కుప్పం: మున్సిపల్‌ నామినేషన్ల పరిశీలన సందర్భంగా కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నామినేషన్‌ కేంద్రం వద్ద ఉన్న అభ్యర్థులు పరుగులు తీశారు. ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతున్నట్లు సమాచారం. ఘర్షణకు దారితీసిన కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్