మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీకాకుళం బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

1 గంట క్రితం

0d5437f9-1d3e-4d57-8152-a5394d141b07.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 06:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతు.. మరో ఇద్దరి కోసం గాలింపు

ప్రజాశక్తి-శ్రీకాకుళం: శ్రీకాకుళం రూరల్‌ మండలం గణగళ్లవానిపేట బీచ్‌లో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కోచింగ్‌ సెంటర్‌కు చెందిన విద్యార్థులు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో నలుగురు గల్లంతవగా, వారిలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. విజయనగరం జిల్లాకు చెందిన పావని, మాధవి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ధనుంజయనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్