ప్రజాశక్తి-కంచికచర్ల : కంచికచర్ల మండలం పరిటాల క్వారీల అనుమతుల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారు క్వారీలలో కొత్త క్వారీల అనుమతులు కోసం, పాత వాటి అనుమతుల పొడిగింపు కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖలు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం శనివారం పరిటాలలో జరిగింది. క్వారీల వల్ల తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నాయని, సాగుచేసిన పంటలు సైతం దెబ్బతింటున్నాయని. క్వారీల యజమానులు తమకి ఇస్తామన్న నష్టపరిహారం అందించడంలో వైఫల్యం చెందారంటూ రైతులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరువురు రైతులను అదుపులోకి తీసుకోవడంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ పొలాల్లో దుమ్ము ధూళి వలన పంటలు పండక నష్టపోతున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రైతులకు అధికారులకు కొంత సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. గతంలో అయ్యప్ప స్టోన్ క్రషర్ యజమానితో జరిగిన ఒప్పందాలు అమలు చేయలేదని, నష్టపరిహారం చెల్లిస్తానని చెల్లించలేదంటూ రైతుల నిరసన వ్యక్తం చేశారు. దీనిపై క్వారీ యజమానుల నుంచి కానీ అధికారులను స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించి దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా పలువురు ఆటంకం కలిగించారంటూ ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన అధికారులు తాసిల్దారుకు ఫిర్యాదు అందించడంతో, తహసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకుకు ఆందోళన చేస్తున్న పలువురు రైతులను పోలీసుల అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. తమకు న్యాయం చేయాలని అడిగితే మహిళా రైతులు అని కూడా చూడకుండా నెట్టుకుంటూ పోలీసులు వెళ్ళారని, రైతులైన మమ్మల్ని అరెస్టు చేయడం ఇదెక్కడి న్యాయం అంటూ రైతులు వాపోయారు. అరెస్టు ఆయన రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కంచికిచెర్ల తహసిల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇప్పటివరకు ముగ్గురుని అదుపులో తీసుకున్నట్లు కంచికచర్ల ఎస్సై విశ్వనాధ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిఆర్ఓ లక్ష్మీ నరసింహం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, తాహసిల్దార్ సిహెచ్ నరసింహారావు, సిఐ వైవివిఎల్ నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పరిటాల క్వారీల ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)